Subscribe Us

header ads

జనసేన జెండాపై మూత్రవిసర్జన చేయలేదు కావాలని డబ్బు కోసం అక్రమ కేసులో ఇరికించారు


 ఆగిరిపల్లి:


ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన బెజవాడ శ్రీ హర్ష మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నేను మూత్ర విసర్జన చేశాను అని అక్కడ లేని ఎస్సి సోదరుని ఒకరిని తీసుకువచ్చి కులం పేరుతో దూషించానని నా మీద ఎస్సీ ఎస్టీ అక్రమ కేసు పెట్టించడం దుర్మార్గమైన చర్యని తెలియజేశారు.జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల మాకు చాల అభిమానం ఉంది.పార్టీలకతీతంగా ఆయన సినిమాలను నేటికీ చూస్తాను.అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు చూస్తుంటే నిజంగా ఇలాంటి నాయకులు ప్రజలకు అవసరమనిపిస్తుంది. కానీ ఆ పార్టీలో కొందరు ఆయన ఆశయాలకు సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేయడం లేదు. నాపై దురుద్దేశంతో అక్రమ ఎస్సి, ఏస్టి కేసు పెట్టించిన ఆగిరిపల్లి జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు అని చెప్పుకుని తిరిగే ముక్కు మహేష్ కాలా సింహాచలం అనే ఇద్దరు మమ్మల్ని ఈ కేసు ఎత్తివేయాలంటే రాజీ పడాలని ఐదు లక్షల డిమాండ్ చేశారు.వీళ్ళ వెనక జనసేన నియోజకవర్గ నాయకుడు అయిన బర్మా.ఫానిబాబు తో ఫోన్ టచ్ లో ఉంటూ సలహాలు సూచనలు ఇచ్చి డబ్బులు అడిగించడంలో ప్రోత్సహించాడు.విషయలు అసలు కేసు పెట్టిన సువర్ణరాజు కు తెలియక పోవడం శోచనీయం.ఎస్సీ సోదరుడుని అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజాలని వీళ్లు ఎత్తుగడవేశారు.ముక్కు మహేష్,కాలా సింహాచలం అనే ఇద్దరు రోజు అర్ధరాత్రి వరకు తాగి ఆగిరిపల్లిలో చేసే గొడవలు,అరాచకం అంతా ఎంత కాదు.వీరి ఆగడాల గురించి ఆగిరిపల్లి లో ఎవరిని అడిగినా చెప్తారు.



తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరిన సందర్భంలో ఆనాడు నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు పుట్టినరోజుకు ఫ్లెక్స్ ను తాగి చింపి ఆగిరిపల్లి లో రెండు పార్టీల మధ్య గొడవలకు కారణమైన చరిత్ర వీరిది అని వారి పార్టీల వాళ్లే చెప్తున్నారు.వీరి అసలు నిజ స్వరూపం తెలియని ఆ ఎస్సీ సోదరుడు జనసేనపార్టీ మీద ఉన్న అభిమానంతో వీళ్ళ ఉచ్చులో ఇరుక్కొని మాపై కేసు పెట్టాడు.పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై అక్రమ కేసులు అరెస్టులు చేయకూడదని పదేపదే చెబుతున్న గాని ఆయన మాటలకు తిలోధకాలిచ్చి వీళ్ళు ఇలా చేయడం వాళ్ళ అధినేత పవన్ కళ్యాణ్ అవమానించటమే.ఈ ఘటనకు సంబంధించిన మా దగ్గర ఉన్నటువంటి ఆడియో వీడియో తో ఉన్న ఆధారాలను జనసేన పార్టీ రాష్ట్ర నాయక త్వానికి త్వరలో అందజేస్తాము.ఇలాంటి పనులు చేసిన వారిపై పార్టీ అధిష్టానం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.