Subscribe Us

header ads

పేద ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది,


 గన్నవరం:


కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గంలో,పేద ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని... అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలు చేసిందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు . కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉంగుటూరు మండలం అముదాలపల్లి , కొయ్యగురపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . నేరుగా ప్రజల వద్దకు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం పనితీరు బాగోలేదు కాబట్టే వారికి ఇంటికి పంపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయని పనులను కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలరోజుల్లోనే చేసి చూపించిందన్నారు. సంక్షోభంలోనూ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుందని చెప్పారు . 


మహానుభావులు ప్రాతినిద్యం వహించిన నియోజకవర్గం నుండి తాను శాసనసభకు వెళ్లడం ఆనందంగా ఉందన్నారు . గ్రామం లో ఉన్న రోడ్లు , పంచాయితీ భవనాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు దాసరి బలవర్థన్ రావు , మండల పార్టీ అధ్యక్షులు ఆరుమాళ్ళ కృష్ణా రెడ్డి , నీటి పారుదల సంఘం అధ్యక్షులు ఆళ్ల గోపాల కృష్ణ , సర్పంచ్ కొరివి మాధవి , టీడీపీ మహిళా నేతలు మూల్పురి సాయి కల్యాణి , మెడేపల్లి రమ , చిరుమామిళ్ల సూర్యం , వడ్రణం హరిబాబు , కొరివి గోపీచంద్ , జైపాల్ , జన సేన నేత బర్మా భాస్కర్ , ఎమ్మార్వో విమల కుమారి , కూటమి నాయకులు , కార్యకర్తలు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.