ముసునూరు:
ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు ఏ. సునీల ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయుల దినోత్స వంఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు సునీల మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మింపబడుతుందని తెలిపారు.ఎస్.ఎం.సి చైర్మన్ ఎన్ .యోహాను మాట్లాడుతూ గురువులు అందించే విద్య మా ఊరు విద్యార్ధుల భవిష్యత్తు కి పునాదులు వేస్తాయని తెలిపారు.గ్రామ యువ నాయకులు కొండేటి ఉదయ్ కిరణ్(బాబీ) మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవ మరువలేమనీ ఈ సేవకు వెలకట్టలేమని తెలిపారు.
గ్రామ సర్పంచ్ కె.విజయలక్ష్మీ, స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్ ఎన్.యోహాను మరియు వైస్ సర్పంచ్ తోట.శ్రీ నువాస రావుల ఆధ్వర్యంలో హెచ్.ఎం సునీల,మండల ఎం.ఈ.ఓ సుబ్బారావు,పాఠశాల ఉపాధ్యాయులు వాణికుమారి,నాగేశ్వర రావు లకు శాలువాలతో గౌరవించడం సత్కరించి జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టీ.రంగారావు,వైస్ ఎస్ఎంసి చైర్మన్ డి.దీప్తి, మరియు గ్రామ పెద్దలు పొల్గొనరు