Subscribe Us

header ads

నిలువ నీడలేని దివ్యంగురాలు.

ఖమ్మం :

నేలకొండపల్లి మండల పరిధిలోని ముజ్జుగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు వేముల నాగమణి ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఇంటిని వదిలి నేలకొండపల్లి లోని దుకాణాల ముందు జీవనం వెళ్ళదీస్తుంది. 1983లో నాగమణి తల్లిదండ్రులకు మంజూరైన ఇందిరమ్మ గృహం, నాడు 8 వేల రూపాయలతో నిర్మించారు.వర్షాలకు కురిసి గోడలు నెర్రలు చాచాయి. దీంతో గృహంలోకి విషసర్పాలు చేరి తలదాచు కుంటున్నాయి.ఒంటరిగా ఉండే నాగమణికి పట్టపగలే పాముల సంచారం గమనించి భయంతో ఇల్లు వదిలి గ్రామంలో కొందరు ఇండ్లలో తలదాచుకుంటుంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా ఇల్లు ఎప్పుడు కూలిపోతుందన్న భయంతో ఆమె నేలకొండపల్లి మండల కేంద్రానికి చేరుకొని దుకాణాల ముందు జీవనం వెళ్ళదీస్తుంది.ఆమె పరిస్థితి గమనించిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయపూడి నారాయణ చొరవ చూపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండల క్యాంపు కార్యాలయంలో ఉండేందుకు అవకాశం కల్పించారు. ఆయన గా దాతృత్వానికి పలువురు ప్రశంసించారు.నాగమణి తండ్రి కొంతకాలం క్రిందట మరణించాడు. తల్లి పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. దివ్యాంగురాలైన తన తల్లికి సేవలు అందించలేని పరిస్థితి రావడంతో తన సోదరుడు ఉంటున్న నడిగూడెం మండలం రామచంద్రా

పురంలో తల్లిని ఉంచి తాను పింఛన్ ఆధారంతో బ్రతుకు వెల్లదీస్తుంది. కూడు ఉన్నా గూడు లేదన్న దిగులతో ఆవేదన చెందుతుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే పాత ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటాం అంటుంది వేముల నాగమణి పాలకుల కరుణించి అధికారులు సహకరిస్తే దివ్యాంగురాలు అయిన నాకు గూడు ఉంటుందని ఆశతో ఎదురుచూస్తుంది.