ఖమ్మం :
గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కారణంగా చెరువులు వాగులుతో పాటు ఖమ్మం మున్నేరు జిల్లా,నిండటం తో పాటు జిల్లా వ్యాప్తంగా మరియు ప్రభుత్వ వసతి గృహలు,గురుకులలకు చేరడం తో విద్య సంస్థలలోకి నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ బృందం ఈరోజు దాన్వాయి గూడెంలోని ఎస్సి గురుకులను సందర్శించిచడం జరిగిందాని పిడిఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు.
ఈ సందర్బంగా పిడియస్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ పాల్గోని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కారణంగా చెరువులు వాగులు నిండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్య సంస్థలులోకి నీరు వసతి గృహలలోకి లోతుల నీరు వరదలు రావడంతో విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు బ్యాగులు,స్టేషనరీ,స్కూల్ యూనిఫార్మ్స్ బట్టలు మొత్తం కూడా నీటితో కొట్టుకొని పోయినా నాలుగు రోజులు అవుతున్న కూడా కనీసం జిల్లా అధికారులు కానీ జిల్లా మినిస్టర్స్ పాటించు కోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.హైవే లకు దగ్గర గురుకులలను అద్దె భవనలు మరియు వసతి భవనాలలో విద్యార్థులను ఉంచడం వల్ల ఇలాంటి వరదలకు ఇళ్లలకి పోయినా పరిస్థితి నేడు జిల్లా గురుకుల వసతి గృహల లలో కనిపిస్తుందిని జిల్లా అధికారులపై మండి పడ్డారు.
జలగం నగర్ మైనారిటీ గురుకుల మరియు ధన్వాయి గుండెలోని ఎస్సి గురుకుల లోకి వరద నీరు చేరటం తోటి అక్కడ ఉన్న గురుకులల ప్రిన్సిపాల్ మరియు వార్డెన్స్ అలెర్ట్ కావడం వలన విద్యార్థులకు ఎటువంటి ప్రాణ హాని జరగలేదాన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను గురుకులాలను వసతిగృహాలు చెరువులకు దగ్గరగా ఉంచవద్దన్నారు.అలాగే ధన్వాయి గుండె లోని ఎస్సి గురుకులాల కు చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయడం తో పాటు జలగం నగర్ లోని మైనారిటీ గురుకుల కి సొంతం భవనం ఏర్పాచేయాలలన్నారు.
కావున తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జిల్లామినిస్టర్లు స్పందించి మైనారిటీ ఎస్టీ గురుకుల లో మరియు బీసీ ఎస్టీ వసతి గృహలలో ఉన్న ఎలక్ట్రికల్ పనుల తో పాటు వరదల ద్యారా నెలకొన్న ఇతర సమస్యలు పరిష్కారంతోపాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల నిలిచినటువంటి నీటిని మొత్తం తొలగించి నష్టపోయిన విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు బుక్స్ స్టేషనరీస్ ట్రంకు పెట్టెలు అందించాలని వారు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడియస్ యూ ఖమ్మం జిల్లా నాయకులు ప్రసాద్, లక్ష్మణ్,యశ్వంత్,వంశీ,శివ తదితరులు పాల్గొన్నారు.