ఏలూరు:-
ఏలూరు నగరంలోని పలు వినాయక మండపాలను దర్శించుకున్న యంపి పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్థానిక సత్రంపాడు లక్ష్మీ గణపతి ఆలయానికి విచ్చేసిన యంపి పుట్టా మహేష్ కుమార్ కు ఇవో మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మీగణపతి స్వామి వారికి యంపి ప్రత్యేక పూజలు చేశారు.తదుపరి ఏలూరు నరహరిశెట్టి సూర్యనారాయణ కూరగాయల వర్తక సంఘం వారు ఏర్పాటుచేసిన వినాయక మండపానికి విచ్చేసిన యంపి పుట్టా మహేష్ కుమార్ కు సంఘం అధ్యక్షుడు బొద్దపు గోవిందు మరియు కమిటీ సభ్యులు మేళతాళాలతో, బాణసంచా కాల్చుతూ, భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ మండలంలోని భారీ వినాయక స్వామికి యంపి పూట్టా మహేష్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు