Subscribe Us

header ads

సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కు దుస్సాలువతో సత్కరించి వీడుకోలు పలికిన డా. సలాన.


మెలియాపుట్టి :

సాధారణ బదిలీలో భాగంగా మెళియాపుట్టీ లోనీ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న టీ రాజేష్ కు బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా పాతపట్నం బీజేపీ ఇంఛార్జి డాక్టర్ సలాన శరత్ కుమార్ బీజేపీ నాయకులతో పాటు కలిసి ఎస్ఐ రాజేష్ కు దుస్సాలువ తో సత్కరించి వీడుకోలు పలికారు. ఉద్యగరీత్యా నిబ్బద్ధత తో పనిచేశారని,అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ ను సమర్థవంతంగా పని చేశారని అలాగే ఎన్నికల నిర్వహణ, విజిబుల్ పోలీసింగ్ సమస్య పై స్టేషన్ కు వెళ్ళిన సాధారణ వ్యక్తులకు కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ద వహించి సామాన్యులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల దృష్టి లో మంచి పోలీస్ ఆఫీసర్ గా మన్ననలు పొందారని కొనియాడారు.