జంగారెడ్డిగూడెం:
ఏలూరుజిల్లా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ముంపుకు గురైన విజయవాడ 44 వార్డులో పర్యటిస్తున్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ నిర్వాసితులకు అవసరమైన సకల సౌకర్యాలు ఏర్పాటుకు శాసనసభ్యులు రోషన్ కుమార్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. 44 వార్డులో బాధితుల కు ఆహార పొట్లాలు త్రాగునీటి వసతి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తూ శాసనసభ్యులు రాష్ట్రం కుమార్ బాధితులకు ఓదార్పు, ధైర్యాన్ని ఇస్తున్నారు. రోషన్ కుమార్ తనతో ఉన్న ఎస్ ఆర్ కే టీం ను కూడా వెంట తీసుకువెళ్లి సహాయక చర్యలు పాల్గొంటున్నారు.