Subscribe Us

header ads

ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా...!


 భీమునిపట్నం:

 భీమిలి జోన్ 3వ డివిజన్ కార్పొరేటర్ గంటా అప్పలకొండ ప్రతినిధిగా గంటా నూకరాజు తోటవీధి గ్రామంలో స్థానికుల సహకారంతో సందర్శించారు. స్థానికులు ఇచ్చే సమాచారం మేరకు ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధిలో ఉండే కాలువలు, రోడ్లు, సామాజిక భవనాలు, సామాజిక మరుగుదొడ్ల పరిస్థితులను పరిశీలించారు. అక్కడక్కడ కాలువలో మురికినీరు నిల్వ ఉండటం చూసి వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్ కి అడిగి తెలుసుకున్నారు. ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడటం వలన ఎక్కడనుండో వచ్చిన చెత్త అంతా కాలువలో చేరి నిల్వ ఉందని వెంటనే తొలగిస్తామని చెప్పారు.   ముఖ్యంగా  సామాజి మరుగుదొడ్లు పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పూర్తిగా శిధిలావస్థకు చేరడంతో వినియోగంలో లేదు. మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సిసి రోడ్లు అవసరం ఉన్న చోట వేయించడానికి, అదేవిధంగా మిగిలిన సమస్యలను పరిష్కారం కోసం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం చేయిస్తానని చెప్పారు. 

 మిగిలిన పనులకు సంబంధించి కార్పొరేటర్ గంటా అప్పలకొండ హాజరయ్యే కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించి నిధుల మంజూరుకు ప్రయత్నం చేస్తానని గంటా నూకరాజు హామీ ఇచ్చారు.  ఈ   కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ చురకల రమణ, అర్ధపాకల గురునాధ్, నొల్లి రమణ, గండిబోయిన పోలిరాజు, అల్లిపిల్లి సతీష్, శ్రీనివాసరావు మాస్టర్, వాసుపల్లి వంశీ, శ్రీను స్వామి, బర్రి రాము, బాడా రాజు, చురకల అప్పారావు, కాసరపు ఎల్లాజీ, వాసుపల్లి వంశీ, వాడమొదలు రాము, నొల్లి ఎలమాజీ, పీరుపిల్లి ఎల్లయ్యమ్మ, వాడమొదలు గారమ్మ, నారా గారమ్మ, తెడ్డు అరుణ, బర్రి నర్సియ్యమ్మ, బొడ్డు పైడమ్మ, అల్లిపిల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.