భీమునిపట్నం
సంకురుభుక్త జోగారావు 57వ జన్మదినం సందర్బంగా భీమిలి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గంటా నూకరాజు శాలువా, పూలమాలలతో జోగారావుని సత్కరించి మాట్లాడారు. సంఘసేవకు, సామాజిక సేవకు ముందుండే వ్యక్తి జోగారావు అని అన్నారు. సామాజిక స్పృహ మెండుగా ఉండే నాయకుడని కొనియాడారు. నవయుగ సేవాసంఘం, స్వామి వివేకానంద రీడింగ్ రూమ్ వంటి సంఘాలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు బాసటగా నిలిచారని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఒకే పార్టీలో ఉంటూ పార్టీ నియమావళికి కట్టుబడి పనిచేసే నాయకుడు జోగారావు అని అన్నారు. కుటుంబ సమేతంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నామని గంటా నూకరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చురకల రమణ, గాడు సన్యాసి నాయుడు, కాసరపు నాగరాజు, మారోజు సంజీవకుమార్, గండిబోయిన పోలిరాజు, వాడమొదలు సత్యారావు, కొక్కిరి అప్పన్న, జలగడుగుల మురళి, రాజగిరి రమణ, అప్పికొండ నూకరాజు, కాసరపు ఎల్లాజీ, కుప్పిల గురుమూర్తి, కందుల సుందర్ రావు, అప్పికొండ నర్సింగరావు, వాసుపల్లి వంశీ, కర్రి శివ, శ్రీనివాసరావు మాస్టర్, యానాపు శ్రీను, జరజాపు పాపారావు, సత్తరవు చిన్న, శ్రీను స్వామి, జగన్నాదం, మాదాబత్తుల సత్యన్నారాయణ, శంకర్, వాడమొదలు వీరన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.