Subscribe Us

header ads

వైకాపా హయాంలోనే అక్రమాలు జరిగాయి. తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు పైల బాబ్జి.


 శ్రీకాకుళం,పాతపట్నం:

వైకాపా ప్రభుత్వ హయాంలోనే భూ ఆక్రమణలు జరిగాయని పాతపట్నం తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు పైల బాబ్జి అన్నారు. బుధవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి తెదేపా నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా నాయకులకు సంబంధంలేని స్థలాన్ని గురించి ఆక్రమణ జరిగిందని కథనాలు రాయడం సరికాదన్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో బస్సులకు రూ 20 రూపాయలు ఆసీలు వసూలు చేస్తుండగా అక్రమంగా ఎనిమిది వందల రూపాయలు ఆశీలు వసూలు చేస్తున్నారని పత్రికలో అసత్యాలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అందుకు ట్రావెల్ బస్సు యాజమాన్యాన్ని పిలిపించి వారిచే విలేకరుల ముందు వివరణ ఇచ్చారు.ప్రభుత్వ పాఠశాల స్థలం ఆక్రమణకు గురైందని ఈ ఎర్ర చెరువులోన విరివిగా అక్రమం జరిగాయని, జగనన్న కాలనీలో స్థానికంగా లేకపోయినా వైకాపా నాయకులు డబ్బులు వసూలు చేసి ఇళ్ల పట్టాలని మంజూరు చేశారన్నారు. వైసిపి హయంలోని ఇసుక దోపిడీ జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం పట్టణ అధ్యక్షుడు సైలాడ సతీష్,పాతపట్నం, కొత్తూరు మండలాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.