వేలేరుపాడు
ఏలూరుజిల్లా బుధవారం వెలేరుపాడు మండలం ముంపు ప్రభావిత ప్రాంతాలను పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ కార్యక్రమంలో కట్కూరు, కోయిదా పంచాయతీలలో పేరంటాలపల్లి, టేకుపల్లి గ్రామాల్లో లాంచి ప్రయాణం ద్వారా నేరుగా ముంపు గ్రామాలను సందర్శించారు... బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, మంచినూనె నిత్యావసర సరుకులను ప్రజలకు సరఫరా చెయ్యడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని, ప్రజలెవ్వరు భయబ్రాంతులకు గురవ్వొద్దని మీకు అండగా మేము ఉంటాము అని పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు హామీ ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్,పి డి ద్వామ రాము,ఆర్ డి ఓ అద్దయ్య, డి ఎస్ ఓ రాజు,డి ఎల్ పి ఓ హస్మాతుళ్ళ, ఎంపీ డి ఓ మూర్తి,ఎమ్మార్వో డి వి సత్యనారాయణ, చెల్లన్నదొర , ఈ ఓ పి ఆర్ డి&ఆర్ డి సి, సెక్రటరీ మండల జనసేన అధ్యక్షులు గణేసుల ఆదినారాయణ, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.