Subscribe Us

header ads

పోతునూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం.


 ఏలూరు:


ఏలూరు జిల్లాదెందులూరు మండలం.

సెప్టెంబరు, 25: వ్యవసాయ ఆధునిక సాంకేతిక పద్దతులను, పరిజ్ఞానాన్ని రైతులకు అందించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. బుధవారం దెందులూరు మండలం పోతునూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రంలో దెందులురు ఎమ్మెల్యే చింతమనేని ప్రబాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. పంట పొలాలు పరిశీలించి ఆయా పంటలకు సోకుతున్నతెగుళ్లు, సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయశాఖ అధికారులు, రైతులతో చర్చించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటలో ఉండి ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులను చైతన్యం పరచాలన్నారు.  



జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభం అవుతున్న దృష్ట్యా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధర రైతులకు అందించే దిశగా అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం రైతుల సంక్షేమ దిశగా అడుగులు వేస్తుందన్నారు. రైతులకు ఆధునిక పద్దతులను శాస్త్రవేత్తలు తెలియజేస్తూ నికర ఆదాయం పొందే విధంగా కృషి చేయాలన్నారు. డ్రోన్ సాంకేతిక విధానాన్ని సాగులో వినియోగించుకునేలా రైతులను సమాయాత్తం చేయాలన్నారు. 



గత సీజన్ లో రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలను నూతన ప్రభుత్వం రాగానే చెల్లించడం జరిగిందని చెప్పారు.  కార్యక్రమంలో దెందులూరు మండల ప్రత్యేక అధికారి గృహ నిర్మాణ శాఖ పిడి, శ్రీనివాసరావు, ఆర్డీవో ఎన్ఎస్ కె ఖాజావలి, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వై. సుబ్బారావు, ఎవో డి. వెంకటేశ్వరరావు, ఎంపిడివో శ్రీలత, తాహశీల్దార్ సుమతి, స్ధానిక నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.