బుట్టాయిగూడెం:
బుట్టాయిగూడెం పిసా గ్రామసభలో పునరుద్దించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక ఆదివాసీ విజ్ఞాన కేంద్రం లో కమిటీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా జిల్లా అధ్యక్షులు తెల్లం.రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు నాగేశ్వరావు,గిరిజన సంఘం మండల కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24వ తేదీ నుండి అన్ని ఐటిడిఏ పరిధిలో ఉన్న షెడ్యూల్డ్ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించటానికి పిసా, గ్రామ కమిటీలు పునరుద్ధానికి ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఆ ఉత్తర్వులు ప్రకారం ఈనెల 24వ తేదీ నుండి పీసా గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని కోట రామచంద్రపురం ఐటిడిఏ పరిధిలో గ్రామలో పిసా గ్రామకమిటీలు ఏర్పాటు చేయటానికి షెడ్యూలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పీసా గ్రామసభ నిర్వహించడం కోసం ఉన్నత అధికారులు జోక్యం చేసుకోవాలని సూచించారు.పాత పీసా గ్రామ కమిటీలు ఉన్నా పరిగణలో లేకుండా పోయిందని ఆదివాసీల అభివృద్ధికి పీసా గ్రామ కమిటీలకు ప్రాధాన్యత ఉందన్నారు.అన్ని గ్రామాల్లో పిసా గ్రామ సభలు నిర్వహించాలని ఎటువంటి గిరిజనేతరుల పెత్తనాలు , బెదిరింపులు లేకుండా అవగాహన కలిగిన గిరిజనులతో నూతన కమిటీలను పునరుద్దించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పీసా గ్రామ నూతన కమిటీలు పునరుద్దించడానికి ప్రభుత్వ అధికారులు వెంటనే పిసా గ్రామసభల షెడ్యూలను ప్రకటించి వెంటనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు..