చింతలపూడి:
నవంబర్ 25 ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ కి పామాయిల్ గెలలు సరఫరా చేస్తున్న లారీలు మరియు ట్రాక్టర్లు అధిక లోడుల ను అరికట్టాలని ఆర్టిఏ అధికారులను కోరుతున్న ప్రజలు మరియు ప్రయాణికులు.
చింతలపూడి పట్టణ సీతానగరం సమీపంలో ఉన్న గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ కి పామ్ ఆయిల్ కలెక్షన్ సెంటర్ నుండి పామాయిల్ గెలలను సరఫరా చేసే ట్రాక్టర్లు , లారీలు భారీ, ఎత్తున లోడు వేసి రవాణా జరుగుతున్నప్పటికీ ఆ పై ఎత్తున ఉన్నటువంటి గెలలు రోడ్డుపై జారిపడి రోడ్డుపైన ప్రయాణించే ప్రజలకు ప్రమాదకరంగా ఉంటున్నాయని గతంలో ఈ విషయంపై ఆర్టిఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధిక సరఫరా నిలుపుదల చేయడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇప్పటికైనా గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ కి ,సంబంధించిన లారీలు మరియు టక్టర్లకు, ఈ విషయంపై అవగాహన కౌన్సిలింగ్ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు మరియు ప్రయాణికులు. అధిక స్పీడ్ తో ప్రయాణిస్తున్న లారీలు ట్రాక్టర్లు పైనుండి అకస్మాత్తుగా రోడ్డుపై పడుతున్నటువంటి పామ్ ఆయిల్ గెలలు ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని దీనికి పూర్తి బాధ్యత గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ మరియు ఆర్టిఏ సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ప్రజలు