జంగారెడ్డిగూడెం:
ఏలూరుజిల్లా స్థానిక చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీచర్స్ డే ని కళాశాల కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.ప్రసాద్ బాబు సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని పూలమాలతో సత్కరించారు. తదనంతరం విద్యార్థులను ఉద్దేశించి గురువు యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ తల్లిదండ్రులు జీవితానికి బాటలు వేస్తే ఉపాధ్యాయుడు జీవించడానికి బాటలు వేస్తాడని అన్నారు. తదనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత ఏ సంబంధం లేకపోయినా విద్యార్థి గురించి ఆలోచించే మొదటి వ్యక్తి ఉపాధ్యాయుడు అని ఉపాధ్యాయుడు చెప్పింది విని విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎమ్.మధు, రసాయన శాస్త్ర అధిపతి యు. వెంకటాచార్యులు, గణిత శాస్త్ర విభాగ అధిపతి డా. సిహెచ్.బదరీ నారాయణ, కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్ సిహెచ్.రమాదేవి, మెంబర్స్ పి ఎస్ రావు, వి హనుమంతరావు, కే వి వి శిరీష, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.