భీమునిపట్నం:
భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మాట్లాడారు. గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కారణంగా విజయవాడ చుట్టుప్రక్కల గ్రామాలు నీటిలో మునిగి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతటిని రంగరించి అధికార యంత్రాంగంతో సహాయక చర్యలు చేపడుతుంటే జగన్ రెడ్డి మాత్రం దురుద్దేశ్యపూర్వక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఏడు పదుల వయస్సులో కూడా రాత్రింబవళ్ళు బాదితులను ఆదుకోవడమే ద్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. సినీరంగ ప్రముఖులు, వ్యాపార సంస్థ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటురంగ ఉద్యోగ యూనియన్ నాయకులు, క్రీడాకారులు అందరూ తనదైన శైలిలో సహాయం చేస్తుంటే మెచ్చుకోవలసింది పోయి విమర్శలు చేయడం తగదని అన్నారు. నేడు వరదలకు విజయవాడ నీటమునగడానికి కారణం నాడు అధికారంలో ఉన్న వైసిపీ చేసిన పాపాలేనని అన్నారు. 2019-24 మధ్య కాలంలో అడ్డూ అదుపు లేకుండా ఆక్రమించి నీటి కుంటలను పూడ్చేసి నిర్మాణాలు చేశారని అన్నారు.
అంతేకాకుండా మొదటినుండి అమరావతిని వ్యతిరేకస్తున్న వైసిపీ పెద్దల దుహంకారంతో నేడు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎవరో దుండగులు ప్రకాశం బ్యారేజిలోకి పడవలను వదిలారని దీని కారణంగా అమరావతి నీటమునిగిందని చెడు ప్రచారం చేద్దామని అనుకున్న తుగ్లక్ ఆలోచనల ప్రతిఫలం ఇదని అన్నారు. ఆక్రమణలు తొలగించి విజయవాడ నగరాన్ని కాపాడాలని గంటా నూకరాజు ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేసారు. విపత్తులు వచ్చేటప్పుడు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అన్నారు. ఈ వయస్సులో కూడా ప్రజల కష్టాలను మీ కష్టాలుగా భావించి సహాయకచర్యలు ముమ్మరం చేయడంలో మీకుమీరే చాటని గంటా నూకరాజు అన్నారు