Subscribe Us

header ads

యువ రచయిత రైటర్ రాజు కి ఉత్తమ నవ యువ సాహితి తేజం పురస్కారం లభించింది.


  హైదరాబాద్: 

ఈరోజు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సిటీ కల్చరల్ సెంటర్లో ఆలూరి కల్చరల్ & సోషల్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గురు పూజోత్సవం - సినీ సుమధుర గీతాలాపన గౌరవ డాక్టరేట్ అవార్డులు,గురువులకు పురస్కారాలు అదేవిధంగా రైటర్ రాజు (యువ రచయిత)కి ఉత్తమ నవ యువ సాహితి తేజం అవార్డును స్వీకరించారు.ప్రశంస పత్రం కూడా అందజేశారు.అదేవిధంగా గౌరవ అతిథులు రాజుకి శాలువాతో సత్కారం చేసినారు.రాజు సాహిత్యంలో భాగంగా గురువుల పట్ల గౌరవంతో,గురువుల గొప్పతనం గురించి తెలియజేస్తూ రాసిన కవిత రచన పోటీల్లో పాల్గొని,అతడు రాసిన కవితలను గుర్తించి ఆలూరి కల్చరల్ & సోషల్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉత్తమ నవ యువ సాహితి తేజం పురస్కారం అందుకోవడం జరిగింది.

తనకు పురస్కారం వచ్చిన సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన గౌరవ అతిథులు,ముఖ్య అతిథులు,కవులు రచయితలు కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ రాజుకి అభివంద నాలు తెలియజేసినారు. జీవితంలో మరెన్నో అవార్డులు,పురస్కారాలు అందుకోవాలని, సాహిత్య రంగంలో మరెన్నో విజయాలు సాధించాలని, సాహిత్యంలో ఎన్నో రచనలు కవితలు రాయాలని,అతిథులు రాజుకి పురస్కారం వచ్చిన సందర్భంగా ఈ విధంగా హర్షం వ్యక్తం చేశారు. తనకు అభివందనాలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు.