Subscribe Us

header ads

వైద్య క్యాంపులు నిర్వహించిన సి హెచ్ ఓ సరోజా.


 జీలుగుమిల్లి:

ఏలూరుజిల్లా జీలుగుమిల్లి మండలంలో గురువారం సి. హెచ్. ఓ. సరోజ ఆధ్వర్యంలో వైద్య క్యాంపులు నిర్వహించారు. కామయ్యపాలెం పీ.హెచ్.సి పరిధిలోని గ్రామాల్లో ప్రజలు విషజ్వరాల బారిన పడ్డ వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఆరోగ్య కేంద్రాలకు రాలేక అనేక అవస్థలు పడుతున్న తరుణంలో బొత్తప్పగూడెంలో వైద్య శిబిరాలు నిర్వహించి అక్కడే రక్త నమూనాలను సేకరించి మలేరియా వంటి పరీక్షలు చేస్తు వైద్య సేవలను అందిస్తున్నారు. మంచం పట్టిన వారిని సైతం నేరుగా తమ బృందం సహాయంతో ఇంటి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో.. హెచ్.వి జోగమ్మ, సి హెచ్ ఓ రోషిని, ఎం పి హెచ్ ఎ సుశీల మరియు మేల్ వసంత రావు ఏఎన్ఎం రత్నకుమారి, ఆశ శిరోమణి పాల్గొన్నారు.