జంగారెడ్డిగూడెం:
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ అయినాల రమణమూర్తి ఆధ్వర్యంలో, జిల్లా కన్వీనర్ శ్రీమతి త్రిపుర రమేష్ ఆర్థిక సహాయంతో, పర్యావరణ పరిరక్షణ కోసం, "మట్టి వినాయక విగ్రహాలు పుజిద్దాం" అనే కార్యక్రమంలో భాగంగా, జంగారెడ్డిగూడెం నూతన బస్టాండు సమీపంలో ఉన్న 'వినాయకుడు గుడి' వద్ద , ఈ రోజు అనగా 06/09/24 శుక్రవారం నాడు, మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి విగ్రహాన్ని అధ్యక్షులు శ్రీ అయినాల రమణమూర్తి చేతులు మీదుగా అందించడం జరిగింది.
అలాగే ఈ కార్యక్రమంలో పర్యావరణం సభ్యులు శ్రీ దల్లి ఆంజనేయ రెడ్డి వితరణతో తులసి మొక్కలు కూడా విగ్రహాలతో కలిపి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవత సెక్రటరీ మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ మహంకాళి రంగ ప్రసాద్, మండల చైర్మన్ శ్రీ ఆకుల ధర్మరాజు, ఆత్మీయ సహకార కమిటీ శ్రీ గద్దె సత్యనారాయణ,EC సభ్యులు శ్రీ సురేష్ , శ్రీ రమేష్ బాబు, చిన్నారి సభ్యులు చిరంజీవి మేఘన మరియు చిరంజీవి దిలీప్ సూర్య తదితరులు పాల్గొన్నారు .