ఆగిరిపల్లి:
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి పర్యటించనున్నారు.ఆగిరిపల్లి మండలం సగ్గురు గ్రామంలో ఉదయం పది గంటలకు సీసీరోడ్ల శంకుస్థాపన,పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.కొమ్మూరు గ్రామంలో ఉదయం పదకొండు గంటలకు సీసీ రోడ్డు డ్రైన్లు శంకుస్థాపన కార్యక్రమం. వట్టిగుడిపాడు గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలుకు సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం మరియు మంచి ప్రభుత్వం (ప్రజా వేదిక) బహిరంగ సభనిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు