Subscribe Us

header ads

వరద బాధితులకు జిల్లా పరిషత్ హై స్కూల్ రేమల్లె విద్యార్థులు విరాళం,


 గన్నవరం:

కృష్ణజిల్లా , గన్నవరం నియోజకవర్గ పరిధిలో గల, బాపులపాడు మండలం, జిల్లాపరిషత్ హై స్కూల్ రేమల్లి విద్యార్థులు వరద బాధితులకు విరాళం అందించడం అభినందనీయమని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం చేస్తే బాగుంటుందని ప్రధానోపాధ్యాయులు ఎన్ లోదర్ పాల్ విద్యార్థులకు పిలుపునివ్వగా తల్లిదండ్రులు, గ్రామస్తులు,అందరూ స్పందించి విద్యార్థినీ విద్యార్థులకు 25205 రూపాయలు విరాళాలు సేకరించారు .ఈ ఆర్థిక సహాయాన్ని, *ముఖ్యమంత్రి సహాయనిధి కి పంపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్
పేరట డిమాండ్ డ్రాఫ్ట్ తీసి నేడు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారికి , ప్రధానోపాధ్యాయులు నన్నెపాముల లూధర్ పాల్ మరియు సీనియర్ ఉపాధ్యాయులు దారపు రెడ్డి భాస్కరరావు పాఠశాల స్టాఫ్ సెక్రటరీ వెలమర్తి రవిబాబు సీనియర్ ఉపాధ్యాయులు పరస రాజేష్, విద్యార్థులు కలిసి ఆ డి డి ని అందించారుఈ సందర్భంగా రేమల్లి గ్రామ ప్రముఖులు కలపాల రాధాకృష్ణ, యనమదల శ్రీనివాసరావు, యనమదల సుధాకర్ విరాళాలు సేకరించిన విద్యార్థులను,వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయ బృందాన్ని ఎస్ఎంసి చైర్మన్ సోది మెల్ల శ్యామ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కు సంబంధించిన ఆళ్ల వెంకట రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది