గోకవరం :
కొత్తపల్లి ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ కనకరాజు మరియు జెసిఎల్ కాకినాడ ఆదర్శ డైమండ్ సహకారంతో మరియు ఎన్ఎస్ఎస్ అదర్శ విద్యార్థిని విద్యార్థులు రాజమండ్రి ఆర్డివో వారి సూచన మేరకు బుధవారం ఆదర్శ హాస్టల్ విద్యార్థుల విద్యార్థులు సహకారం తో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలకు 400 ఆహార పొట్లాలను తయారు చేయించి కొత్తపల్లి విఆర్ఓ వారికి అందజేయడం జరిగిందని సెక్రటరీ నాగమణి తెలియజేశారు.విద్యార్థులు తయారుచేసిన ఆహార పొట్లాలను గోకవరం మండలం ఎమ్మార్వో మేడం వారికి అందజేయడం జరిగిందని కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదర్శ హాస్టల్ విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ త్రినాధరావు, వైస్ ప్రిన్సిపాల్ సుజనీ,డైరెక్టర్ కె.హారిక,కె.సంతోష్, ఎ.ప్రవల్లిక,ఎ. సంతోష్ ఆదర్శ హై స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ తదితరులు అభినందించారు.