ఏలూరు:-
ఏలూరు జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(ఏ పి డబ్ల్యూ జె ఎఫ్)జిల్లా కమిటీ ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వేట్రీ సెల్వి కి విజ్ఞప్తి చేయడం జరిగింది.
సంబంధిత అధికారులతో చర్చించి రెండు మూడు రోజుల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వేట్రీ సెల్వి.