జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచడం కోసం అవసరమైనటువంటి సామాగ్రిని అనగా (దంతులు, డ్రైన్ పారలు, చేతి పారలు, కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, మాస్క్ లు మరియు గ్లౌజ్ లు) గౌరవ శ్రీమతి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.వీ రమణ, సెక్రటరీస్ మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొనడం జరిగింది.