Subscribe Us

header ads

గ్రామాలు అభివృద్దే లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమం.

లింగపాలెం:-

 ఏలూరుజిల్లా లింగపాలెం మండలంలో 5 కోట్ల 60 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు చేసిన చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ. సొంగ రోషన్ కుమార్  కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి, సంక్షేమంలో కళకళలాడుతూ ఉండాలి. అయ్యపరాజుగూడెం, కలరాయనగూడెం, భోగోలు, ములగలంపాడు, రంగాపురం, వేములపల్లి, ఆసన్నగూడెం, బాదరాల, పోలాసీగూడెం గ్రామాలలో సీసీ రోడ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు. గ్రామాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులతో గ్రామాలు ఎంతో కళను సంతరించుకుంటుందని అన్నారు.

ఈ రోజు లింగపాలెం మండలంలోని 9 గ్రామాలలో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు పలు గ్రామాలలో పర్యటిస్తూ 5.60 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మండలం లోని 9 పంచాయతీలలో ఉదయం నుంచి రాత్రి వరకూ పండుగ వాతావరణంలో గ్రామాలలో శంకుస్థాపనలు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల వైయస్సార్ ప్రభుత్వం లో ఎక్కడ తట్ట మట్టి కూడా వేయలేకపోయారు అని వైసీపీ పాలనపై ఆయన వ్యాఖ్యలు చేశారు.

 గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి కి నోచుకోలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధృడ సంకల్పంతో యం.జి.యన్.ఆర్.జియస్ నిధులు తో ఈ పనులు చేపడుతున్నారని యం.యల్.ఎ రోషన్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు.కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు పాల్గొన్నారు