నూజివీడు /ఆగిరిపల్లి :ఏలూరు జిల్లా,ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలోని శ్రీ శోభనాచల వ్యాఘ్రలక్ష్మీనరసింహస్వామిని గురువారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, వేదపండితులు, మంగళవాయిద్యాలతో, పూర్ణకుంభంతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వికి స్వాగతం పలికారు. శ్రీ శోభనాచలవ్యాఘ్రలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కలెక్టర్ ప్రదక్షణలు చేశారు. అనంతరం వేదపండితులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వికు వేద ఆశీర్వచనాలు అందించి తీర్ధప్రసాదాలు అందించారు.
కలెక్టర్ వెంట నూజివీడు ఆర్డిఓ వై. భవానీశంకరి, తహశీల్దారు ప్రసాద్, ఆలయ ఇవో డి. సురేష్ బాబు, ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి సిహెచ్ రంగారావు పాల్గొన్నారు.