Subscribe Us

header ads

గంపలగూడెం మండల ప్రజలందరికీ విజయ దశమి పండుగ శుభాకాంక్షలు...

 తిరువూరు:-

తిరువూరు నియోజకవర్గ గంపలగూడెం పోలీస్ స్టేషన్లో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సై శ్రీను దంపతులు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆయుధ పూజ ఘనంగా నిర్వహించిన పోలీస్ శాఖ.. విజయ దశమి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ ఎస్.శ్రీనుమాట్లాడుతూ..

విజయ దశమి పండుగ అనేది భక్తి శ్రద్దలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ అని, నవరాత్రి పండుగ సందర్భంగా, భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి పండుగ సందర్భంగా ఆ దుర్గా దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో సిరిసంపదలతో తుల తూగాలని ఆకాంక్షిస్తున్నామని కోరుకుంటూ....