విజయవాడ,:-
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలో,న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో దసరా ఉత్సవాలు పురస్కరించుకొని పేద విద్యార్థిని విద్యార్థులు అమ్మవారిని విజయాలను చేకూర్చే ఆ విజయ దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం పాడిపంటలతో పచ్చగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. విజయదశమి కార్యక్రమం తో పాటు సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి రాజరాజేశ్వరి దేవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత పీఎం గోల్డ్ అధినేత అర్జున్, సంస్థ అధ్యక్షురాలు. రాజరాజేశ్వరి దేవి ముఖ్య అతిథులుగా పాల్గొనగా పట్నాల హరిబాబు, లోవరాజు ప్రముఖులు , విచ్చేసినారు అనంతరం వారు అందరూ మాట్లాడుతూ ఒకరి తర్వాత ఒకరు సంస్థ చేస్తున్న సేవలను,
ఉచిత విద్య, దీర్ఘకాలిక వ్యాధిగాస్తుల పిల్లలకు, పెద్దలకు పౌష్టిక ఆహారం, వృద్ధులకు, దివ్యాంగులకు, చికిత్స కొరకు, రక్తదాతలుగా విద్యార్థినీ విద్యార్థులకు మత్తు మాదక ద్రవ్యాల పై ప్రస్తుతం నెలకొన్న సైబర్ నేరాల పై బాల్య వివాహాల పై బాల్య కార్మికుల నిర్మూలన పై చదువులు అనేక విషయాల్లో ఒత్తిడి పిల్లలు చేతిలో ఫోనులపై మరెన్నో చెడు లక్షణాలపై అన్ని వర్గాల వారు వాటికి దూరంగా ప్రత్యేక అవగాహన వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తూ ఇప్పటివరకు సుమారు రెండువేల పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి వాళ్ళ బృందాన్ని వారి మాతృమూర్తి సంస్థ అధ్యక్షురాలు రాజరాజేశ్వరి దేవి ప్రశంసించారు
ఆ సంస్థకు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే మరెన్నో జీవితాలకు అండదండగా ఉంటారని భరోసా ఇస్తూ దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ కు గత సంవత్సరంలో డిసెంబర్ 1న ఎయిడ్స్ డే పురస్కరించుకొని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పౌష్టికాహారం సహాయ నిమిత్తం గవర్నమెంట్ నుండి మొట్టమొదటి ప్రశంస పత్రం అందుకోగా, ఈ సంవత్సరం గౌరవనీయులు హైకోర్టు జడ్జి చేతుల మీదుగా ఉగాది పురస్కారం, రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెరిటేరియస్ అవార్డు వివిధ సేవా కార్యక్రమాలకు
స్ఫూర్తిగా అందుకున్నారని అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు చదువుల్లో పలు ప్రతిభలో చూపిస్తూ ప్రశంస పత్రాలు జ్ఞాపకాలు అందుకుంటున్నారని ఇది ఎంతగానో గర్వించకుదగ్గ విషయమని, సంస్థ విద్యార్థుల పట్ల ఆశాజ్యోతి గా మారిందని పలు విధాలుగా అతిథులు, ప్రముఖులు అభినందించారు విద్యార్థి విద్యార్థులకు పలు కార్యక్రమాలు వారు చూపించిన ప్రతిభకు గాను సంస్థ తరఫున ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్, హరి, నరేష్ పలువురు పాల్గొన్నారు.