ఏ కొండూరు:-
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం లో పెనుగొల్లను గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చదువుకుంటున్న విద్యార్థులు, జింకల పాలెం, రాజుల పాలెం నుంచి విద్యార్థులు స్కూల్ కి రావడానికి ఇబ్బందిగా ఉందని 15 మంది విద్యార్థులు అందరూ కూడా కలిసి ఈరోజు పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే, వెంటనే స్పందించి 15 మంది విద్యార్థులందరికీ ఉచితంగా తన సొంత వ్యయంతో సైకిల్ని ఇస్తానని హామీ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావు. అదేవిధంగా గంపలగూడెం మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో సిమెంట్ రోడ్ల శంకుస్థాపనకి వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాస్ కు, నాయకులు కార్యకర్తలు ప్రజలు తండోపతండాలుగా మరి ఎక్కువగా యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.