మైలవరం:-
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో 'పల్లెపండుగ' వారోత్సవాల్లో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుల్లూరు గ్రామంలో 1050 మీటర్ల పొడవునా 6 రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వెల్లడించారు. ఆ రహదారుల నిర్మాణానికి ఆయన మంగళవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పల్లెలకు పూర్వ వైభవం కలుగుతుందన్నారు. గ్రామాల్లో రహదారులకు మోక్షం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ఎన్డీయే ప్రభుత్వంలో ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.