ఇబ్రహీంపట్నం:-
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మంగళవారం విభజన ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదిగలకు ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కేటాయించలేదని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం జరిగిందని, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాల సామాజిక వర్గానికి చెందిన కారేం
శివాజీని నియమించడం జరిగిందని,తదనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిందని వారు 2019 తరువాత ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ గా రెండు గా విభజించడం జరిగిందని తదానంతరం ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాల సామాజిక వర్గానికి చెందిన మారుమూడి విక్టర్ ప్రసాద్ ని నియమించడం జరిగిందని,2024 సంవత్సరంలో జరిగిన
సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాలలో మాల మాదిగల కు సమాన అసెంబ్లీ సీట్లు పంపిణీ చేసి సామాజిక న్యాయాన్ని పాటించిన నారా చంద్రబాబునాయుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ ను నియమించడంలో కూడా ఇప్పటివరకు మాదిగలకు దక్కని ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదిగలకు కేటాయించి సామాజిక న్యాయం చేస్తారని, ఆసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి విజ్ఞప్తి చేస్తున్నాం.