ఆగిరిపల్లి:-
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంసమాజంలో వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుచున్న వారికి చేయూత అందించడానికి దాతల సహకారం ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయ రామారావు అన్నారు.తోటపల్లి లో గల హీల్ కృత్రిమ అవయవ కేంద్రం లో ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి.మొవ్వ శారద, ఆమె భర్త దిగవంత డా. కొత్త. రవీంద్ర బాబు పేరున ఇచ్చిన ఆర్ధిక సహాయముతో ఏలూరు జిల్లా రమణక్కపేట కు చెందిన ఎన్.మౌనిక, సింగన్న గూడెం కు చెందిన సి.హెచ్ మేఘన,ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కు చెందిన డి.శిరీష
జి. కొండూరు కు చెందిన ఎ. ప్రియాంక లకు కృత్రిమ కృత్రిమ కాళ్ళను అందజేశారు.వి.విజయ రామారావు మాట్లాడారు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళను ఉచితముగా అందచేయుటకు సహకరిస్తున్న దాతలుకాకరాల శంకర్ రావు తదితరులను అయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్ మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ డా.వి.ఎన్. మస్తానయ్య,హీల్ కార్యదర్శి తాతినేని లక్ష్మి, సి.ఈ.ఓ. కూరపాటి అజయ్ కుమార్,సీనియర్ టెక్నీషియన్ కె.చిన్నా పాల్గొన్నారు.