Subscribe Us

header ads

నాట్యాచార్యులు వెంపటి చినసత్యం సేవలు ప్రశంసనీయం!

 పామర్రు:- 

నాట్య రంగంలో డాక్టర్ వెంపటి చినసత్యం చేసిన సేవలు ప్రశంసనీయమని పలువురు అన్నారు. కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర నాట్య కళా పీఠం నందు మంగళవారం నాట్యాచార్యులు డాక్టర్ వెంపటి చినసత్యం 95వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వెంపటి చినసత్యం శృతి సదనం నందు గల ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం విద్యార్థులకు బోధన, బోధనేతర సిబ్బందికి జన్మదినోత్సవ సందర్భంగా స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో కళా పీఠం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, వసుమర్తి హరినాథ్ శాస్త్రి, వేదాంతం వెంకట దుర్గా భవాని, గ్రంథాలయ పాలకులు వై.వి ఫణి కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, మొదలగువారు పాల్గొన్నారు