Subscribe Us

header ads

ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం

ఆగిరిపల్లి:-

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా మండలం లో అన్ని గ్రామైక్య సంఘాలలోనూ మరియు మండల సమైక్య సమావేశాలు నిర్వహించారు.ఏపీఎం దయాల రాజశేఖర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో పరిసరాల పరిశుభ్రత, హ్యాండ్ వాష్, లిక్విడ్ హ్యాండ్ వాష్ చేసుకోవడం ద్వారా ప్రజలు అనారోగ్యానికి గురి అవ్వకుండా ఉండటానికి, పరిశుభ్రమైన పరిసరాలు మరియు వ్యక్తిగత శుభ్రత చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయని తెలియజేశారు.

 ప్రత్యేక సందర్భాలలో భోజనానికి ముందు,వంట చేయుటకు ముందు,భోజన వడ్డనకు ముందు,మలమూత్ర విసర్జన తరువాత, పిల్లలు ఆటలు ఆడిన తరువాత తప్పనిసరిగా సరియైన పద్ధతిలో సబ్బుతో చేతులు కడుక్కుంటే డెబ్బై శాతం అంటు వ్యాధులు రాకుండా నివారించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం దయాల రాజశేఖర్, ఏ పీ ఓ మీనాక్షి, మండల సమైక్య సభ్యులు,గ్రామ సమైక్యసభ్యులు,వివోఏలు, సీసీలు పాల్గొన్నారు.