Subscribe Us

header ads

పల్లె పండుగతో-గ్రామాలకు పూర్వ వైభవం.

 లింగపాలెం:-

ఏలూరుజిల్లా లింగపాలెం శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తాం.ప్రగతి కోసమే పల్లె పండుగ. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.పల్లె పండుగ.
పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తెలిపారు. బుధవారం లింగపాలెం మండలంలోని అన్ని గ్రామపంచాయతీ లో సీసీ రోడ్డు శంకుస్థాపనలను అధికారులు మరియు కూటమి నేతలతో కలసి భూమి పూజ చేశారు. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చింతలపూడి ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన వందరోజుల్లోనే పెద్ద ఎత్తున గ్రామాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఒక పండుగ వాతావరణాన్ని గ్రామ గ్రామాన తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రకటించారు చింతలపూడి నియోజకవర్గమైన నాలుగు మండలాల్లో. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు.

పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో తాగు నీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని టిడిపి బిజెపి జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.