జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని చింతలపూడి శాసనసభ్యులు ఆదేశాలతో టిడిపి నేతలు ప్రారంభించారు. స్థానిక సూర్యా కళాశాలలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో సూర్య శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, షేక్ ముస్తఫా, నంబురి రామచంద్రరాజు, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, తుటికుంట దుర్గారావు, బొబ్బర రాజ్ పాల్, మద్దిపాటి నాగేశ్వరరావు, రాంబాబు, కరుటూరి రమాదేవి, శీలం గోపి, నాయుడు శ్రీను, పాకనటి కాశీ, షేక్ యాకుబ్, అల్లూరి రామకృష్ణ, మోహన్ గంగ, యస్వంత్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, బుస సత్యనారాయణ, రాగాని శ్రీను తదితరులు పాల్గోన్నారు.
ఈసందర్భంగా ఓటరు నమోదుపై సమీక్ష చేసి ముఖ్య నాయకులకు ఏరియాల వారిగా బాధ్యతలు పంచుకున్నారు. అలాగే సూర్య కళాశాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ లో కూడా ఓటు నమోదు చేసుకునేలా ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది అని అన్నారు. వీటిపై ఎమ్మెల్యే రోషన్, ఈడా శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పనిచేస్తారు. ఈసందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని నేతలు ప్రారంభించారు.