జంగారెడ్డిగూడెం,:-
ఏలూరుజిల్లా కామవరపుకోట రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. కామవరపుకోట మండలంలో పలు గ్రామాల్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు సోమవారం భూమిపూజ. గ్రామాల అభివృద్దే కూటమి సర్కార్ లక్ష్యం.చింతలపూడి నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం. గ్రామాలలో పల్లె పండుగ వాతావరణం సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రజలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటసారిగా చేపట్టనున్న ‘పల్లె పండుగ- పంచాయతీ " వారోత్సవాలతో పల్లె రహదారులకు మోక్షం లభించింది అని అన్నారు.
ఈ నెల 20 వ తేదీ వరకు పల్లె పండుగ వారోత్సవాల నిర్వహణ.సంక్రాంతి నాటికి రోడ్లు పూర్తయ్యేలా ప్రణాళికలు. అందుబాటులో ఉన్న ఉపాధి నిధులతో బిల్లుల చెల్లింపు. పనులు చేపట్టేందుకు ముందుకు వస్తున్న కాంట్రాక్టర్లు. ఐదేళ్ల తర్వాత మెటీరియల్ నిధుల సద్వినియోగం. వైసీపీ పాలనలో ధ్వంసమైన రహదారులకు మోక్షం. గ్రామీణా ఉపాధి నిధులు అందుబాటులో ఉండటంతో బిల్లు చెల్లింపులకు ఢోకాలేదని తెలియడంతో పనులు చేపట్టేందుకు గ్రామాల్లో కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఉపాధి పథకం స్పూర్తిని దెబ్బతీయడంతో పాటు మెటీరియల్ నిధులు వాడుకోవడంలో విఫలమైంది.
నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లతో పాటు పలు సాగు, తాగునీటి వనరుల కల్పనకు ఈ నిధులను వాడి సద్వినియోగం చేసుకునే ఉద్దేశం లో ఉంది అని అన్నారు. అయితే వైసీపీ హయాంలో మొదటి ఏడాది సరైన ప్రణాళికలు లేక నిధులు వృధా అయ్యాయి. ఆ తర్వాత జగనన్న కాలనీల లెవలింగ్ పనులంటూ కొండల్లో, చెరువుల్లో మట్టి పోసి వైసీపీ కార్యకర్తలకు అప్పనంగా నిధులు దోచిపెట్టారు. అలాగే సచివాలయ భవనాల నిర్మాణాలు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో రూ.వేల కోట్ల ఉపాధి నిధులను దుర్వినియోగం చేశారన్నారు.... రాష్ట్రంలో గత టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రోడ్డు నిర్మాణం కూడా జరగలేదుఅని ,గ్రామీణ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యయన్నారు.