తిరువూరు:-
ఈరోజు తిరువూరు నియోజక వర్గం,విసన్నపేటలో సిసి రోడ్లకు శంకుస్థాపన, ఈ కార్యక్రమంను ఉద్దేశించి సిపిఎం నాయకులు నాగరాజు మాట్లాడుతూ! ఈనెల 14 నుండి 20 వరకు పల్లె పండుగ కార్యక్రమాలను,ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు విస్సన్నపేట మండలంలో 23 పనులు 5 కోట్లతో సిసి రోడ్లను శంకుస్థాపన మండలం మొత్తం తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం నిర్వహించటం జరిగింది.బహుశా మండలంలో ఇంతవరకు ఐదు కోట్ల రూపాయల సిసి రోడ్లు రావడం మండలానికి మంచి శుభ పరిణామమే కానీ సీసీ రోడ్లు ఏర్పాటు చేసే క్రమంలో డ్రైనేజీ వాటర్ వెళ్లడానికి అనుకూలంగా సిమెంట్ తూరలు ఏర్పాటు చేయడంలో గతం నుండి మరిచారని ఇప్పుడు ప్రారంభించే సీసీ రోడ్ల కైనా డ్రైనేజీ వాటర్ వెళ్లడానికి అనుకూలంగా తూరలు ఏర్పాటు చేసి వర్షపు మరియు రోజు వారి గ్రామస్తుల వాడకపు నీరు నిల్వ ఉండకుండా చేయాలని సిపిఎం విస్సన్నపేట మండలం కమిటీ డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా మండల అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీ సదుపాయం లేకుండా సీసీ రోడ్లు పోసిన వాటర్ వెళ్లడానికి అవకాశం లేక డ్రైనేజీ వాటర్ నిల్వ ఉండటం వలన దోమలు అధికంగా రావడం వలన ఇతర జబ్బులకు ప్రజలు గురవుతున్నారని కావున గేదెను కొని పలుపు మరిచినట్లు గతంలో ఉందని ఇప్పటికైనా గౌరవనీయులు తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు శంకుస్థాపన చేసి ప్రారంభించే సీసీ రోడ్లకు డ్రైనేజీ వాటర్ వెళ్లడానికా అనుకూలంగా సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ధనలక్ష్మి గద్దల రామకృష్ణ కిషోర్ పాల్గొన్నారు