Subscribe Us

header ads

శ్రీరాజరాజేశ్వరీదేవిగా శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యరూప దర్శనం.



జంగారెడ్డిగూడెం:-

ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న 
శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలలో విజయదసమిని పురస్కరించుకుని శనివారం శ్రీరాజరాజేశ్వరీదేవిగా నూకాలమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నూకాలమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు పీ. ఏ.కృష్ణమూర్తి దంపతులు, భోగవల్లి రత్నాజీరావు దంపతులు, ఇనగడపు వీర రామాంజనేయులు దంపతులు,మరియు అల్లూరి రామకృష్ణ కుటుంబ సభ్యులు,తడికమళ్ళ శ్రీను తదితరులు అమ్మ వారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ మరియు ప్రసాద వితరణకు సహకరించి అంత్రాలయ పూజలలో సభక్తిపూర్వకంగా పాల్గొన్నారు.

 డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) మాట్లాడుతూ దసరా ఉత్సవంలో సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకుంటూ శక్తిస్వరూపదివ్యత్వ ఉనికిని సామాన్య భక్తులకు సైతం అందించే క్రమంలో వీరంపాలెం శ్రీబాలా త్రిపురసుందరీ పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి ఆధ్యాత్మిక మార్గనిర్దేశకత్వంలో నూకాలమ్మ సన్నిధిలో కార్యక్రమాలు రూపొందించి ఆచరిస్తున్నామని,అక్టోబర్ 3 న ప్రారంభమైన ఉత్సవాలు 16 వ తేదీన జరిగే 68 వ చండీహోమం, మహాపూర్ణాహుతి తో సంపూర్ణమవుతాయని, ఈ వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని వివిధ రూపాలలో
దర్శించారని,మహిళలు కుంకుమార్చన, విశేష పూజ,హారతులు,సామూహిక పూజా కార్యక్రమాలు, అభిషేకాలలో పాల్గొని తరించారని,భక్తులు,దాతల తోడ్పాటుతో అమ్మవారి కృపతో దిగ్విజయంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగాయని 

13 వ తేదీ ఆదివారం ఏకాదశిని పురస్కరించుకుని భగవద్గీత పారాయణ అమ్మవారి సన్నిధిలో ఉత్సవాల కొనసాగింపులో భాగంగా జరుగుతుందని అన్నారు.సాయంత్రం శమీపూజ మరియు ఊంజల్ సేవ అర్చక స్వాములు వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు యే విధమైన ఇబ్బందీ కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.