విజయవాడ :శనివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాగంగా విజయవాడ పట్టణము నందు గల Resonance కాలేజీలో చదువుతున్న సాధారణ విద్యార్థులతో, అసాధారణ ఫలితాలు సాధించిన ఘనత విజయవాడలో కేవలం Resonance కాలేజీకే దక్కిందని కాలేజీ యాజమాన్యం శనివారం ప్రకటనలో తెలిపారు.
దీనిలో భాగంగా కాలేజీలో 100 పర్సంటైల్ గాను 99.14, 99, 98.2,97,90 పైన సగానికి పైగా పర్సంటైల్ సాధించిన విద్యార్థులు ఉన్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియా ర్యాంక్ 869, 2435,3417,4794,10174 ఈ విధంగా 20 వేలు లోపు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 40 మంది ఉన్నారు.
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా Resonance విద్యార్థులు విజయ డంక మోగించారు. అందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విభాగంలో 470 మార్కులకు గాను ఎం ఆదిత్య నాగశ్రీకర్ 465 మార్కులు, అదేవిధంగా..464,463,462,461 ఈ విధంగా 460 పైన 12 మంది విద్యార్థులు ఘనత సాధించారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో విద్యార్థులు 1000 మార్కులు గాను 990, 988,988,987,986,985 ఈ విధంగా 980కు పైగా 17 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని Resonance కాలేజీ చైర్మన్ శ్రీ కె వెంకటేశ్వరరావు గారు పేర్కొన్నారు.
కాలేజీ చైర్మన్ కెవిఆర్ మాట్లాడుతూ.... జే ఈ ఈ మెయిన్స్ మరియు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు , అదేవిధంగా కాలేజీ సీఈఓ గౌతమ్ గారు విజయం సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చములు అందించారు.
ఈ కార్యక్రమంలో Resonance కాలేజీ డైరెక్టర్ మాధవరావు గారు మరియు క్యాంపస్ జిఎం కిరణ్ కుమార్ గారు, మరియు అకాడమిక్ డీన్ వి ఎస్ ఆర్ గారు మరియు కాలేజీ బోధన సిబ్బంది విద్యార్థులని అభినందించారు.